'అమలాపురం డివిజన్‌లో 5 బాణసంచా దుకాణాలు సీజ్'
కోనసీమ: వేట్లపాలెం ప్రమాదం నేపథ్యంలో అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో మంగళవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 5 బాణసంచా తయారీ దుకాణాలను సీజ్ చేసినట్లు DSP టీఎస్ ఆర్కే ప్రసాద్ తెలిపారు. అక్రమంగా మందుగుండు సామాగ్రి నిల్వ చేసినా, బాణసంచా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.