డీఎంకే కూటమికి ఎంఐఎం మద్దతు: అసదుద్దీన్

డీఎంకే కూటమికి ఎంఐఎం మద్దతు: అసదుద్దీన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు అభివృద్ధి, లౌకికవాద పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఓటర్లందరూ డీఎంకే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.