పార్టీ ఏర్పాటుపై కవిత కీలక ప్రకటన

పార్టీ ఏర్పాటుపై కవిత కీలక ప్రకటన

TG: పార్టీ ఏర్పాటు చేయడానికి ఇంకా కొంత సమయం కావాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. 'నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రజల కోసం వజ్రాయుధం లాంటి పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. పార్టీ పెట్టకున్నా రాజకీయం చేయవచ్చు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకుడిని వదులుకోవడం వల్లే BRS ఓడిపోయింది. KCR గారిని నేను ఏమీ అనను' అని తెలిపారు.