GHMCలో రోజుకు 7,800 టన్నుల చెత్త సేకరణ
HYD: GHMC పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై కమిషనర్ కర్ణన్ సమీక్షించారు. ప్రతి రోజు నగరంలోనే దాదాపు 7,800 టన్నుల చెత్తను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 4,500 స్వచ్ఛ ఆటోలు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో 2,650 స్వయం సహాయక సంఘాలకు చెందిన 18,557 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో నిరంతరం పని చేస్తున్నారని కమిషనర్ వివరించారు.