బాసర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ దర్శించుకున్నారు. అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు సాదరంగా స్వాగతం పలికి ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అమ్మవారిని దర్శించుకున్నారు.