బురదమయంగా మారిన రహదారి

E.G: గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా గోకవరం మండల కేంద్రంలో ఉన్న ప్రియాంక లేఔట్‌కి వెళ్లే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో అటుగా వెళ్లే వచ్చే వాహనదారులు, పాదాచారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించాలని సమస్యను పరిష్కరించాలని పలువురు కోరారు.