VIDEO: ఘనంగా పంచాంగ శ్రావణం.. పాల్గొన్న భక్తులు
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం పంచాంగ శ్రావణ కార్యక్రమం ఆలయ అర్చకులు అళహరి శేషాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు ఘనంగా నిర్వహించారు. భక్తులకు రాబోయే కాలంలో జరిగే శుభ ఫలితాలను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.