VIDEO: MRO ఆఫీసు వద్ద బట్టలు ఉతికిన దోబీలు
TPT: తిరుపతి రూరల్ MRO ఆఫీసు ఎదుట సోమవారం దోబీలు బట్టలు ఉతికి నిరసన వ్యక్తం చేశారు. రజకులకు వేదాంతపురంలో కేటాయించిన సర్వే నంబర్ 214లో 56 సెంట్ల స్థలాన్ని కొందరు కబ్జా చేశారని దోబీలు ఆరోపిస్తున్నారు. ఘాట్లో బట్టలు ఉతికే ఆస్కారం లేకపోవడంతోనే MRO కార్యాలయం వద్ద ఉతుకుతున్నామన్నారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది.