జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి

జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వాలిచర్ల గ్రామానికి చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గిద్దలూరులో జరిగిన JVV ప్రకాశం జిల్లా 18వ మహాసభల్లో శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రీయ సమాజ స్థాపన కోసం, జన విజ్ఞాన వేదిక ఆశయాల కోసం కృషి చేస్తానని అలాగే, ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.