ఒంగోలు రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో 3 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం పలు బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్‌లో రైళ్ల భోగిలను పోలీసులు తనిఖీ చేశారు. అందులో భాగంగా పూరి నుంచి తిరుపతికి వెళుతున్న పూరి ఎక్స్‌ప్రెస్ రైలు భోగిలో 3 కేజీల గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.