'మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి'

NRML: సారంగాపూర్ మండలం యాకర్‌పల్లి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్పంచ్ వడ్లకొండ దివ్య నవీన్ ఆధ్వర్యంలో గురువారం వినతి సమర్పించారు. ప్రస్తుతం ఉన్న కేంద్రం 4 కి.మీ దూరంలో ఉండటంతో రవాణా ఖర్చులు భరించలేక దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు.