పిడుగు పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

పిడుగు పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

కామారెడ్డి: బీబీపేట మండలం తుజాల్ పూర్‌లో పిడుగు పడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హేమలత, వివేక్, కవిత, రంజిత్, రాజు వరి కళ్లం దగ్గర వడ్లు ఆరబెడుతుండగా పిడుగు పడి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.