INSPIRATION: దాసరి కొండప్ప

INSPIRATION: దాసరి కొండప్ప

దాసరి కొండప్ప.. TG నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన బుర్ర వీణ కళాకారుడు. అంతరించిపోతున్న బుర్ర వీణ కళకు 5 దశాబ్దాలకు పైగా జీవం పోశారు. ఈ కళ ద్వారా అనేక సాంఘిక సందేశాలను, పురాణ గాథలను ప్రజలకు అందించారు. బుర్ర వీణను తన జీవితంగా భావించిన కొండప్ప కృషికి గుర్తింపుగా 2024లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ఈ కళను తర్వాతి తరాలకు నేర్పించడానికి నిరంతరం శ్రమించారు.