ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన జడ్జి
కడప నగరంలో ప్రభుత్వ బాలుర వసతి గృహం, పరిశీలన గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు సందర్శించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసతి, భద్రత, పరిశుభ్రత, ఆహార సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పిస్తూ, ఉచిత న్యాయ సహాయం,హెల్ప్ లైన్ నంబర్లు, బాలల సంరక్షణ పథకాలపై వివరించారు.