ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన

MNCL: జైపూర్ మండలం ముదిగుంటలో ఏఆర్ కానిస్టేబుల్ సాయిరాజ్ ఇంటి ముందు బాధితురాలు నీలిమ తన చిన్నారితో కలిసి నిరసన చేపట్టింది. ప్రేమించి, గర్భవతిని చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తూ తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు రాకతో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకుని కూర్చుంది.