10వ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి

10వ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి

ప్రకాశం: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈఓ సుభద్ర తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు ఈనెల 30వ తేదీలోగా చెల్లించాలన్నారు. రికౌంటింగ్, వెరిఫికేషన్ కోసం ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.