ప్రజలకు వాటర్ ట్యాంకర్ వితరణ

ELR: ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో యలబాక సత్యనారాయణ, లక్ష్మీనరసమ్మల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ప్రజలకు వాటర్ టాంకర్ వితరణగా అందించారు. టీడీపీ గ్రామ అధ్యక్షులు రంగు ఆంజనేయులు శుక్రవారం మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సౌకర్యార్థం ట్యాంకర్ అందించడం అభినందనీయమన్నారు. వేసవిలో ప్రజల దాహార్తి తీరుతుందని అన్నారు. జనసేన నేత పాశం నాగబాబు పాల్గొన్నారు.