'మేడే వేడుకలను విజయవంతం చేయాలి'
MHBD: శ్రామికులంతా మేడే వేడుకలను విజయవంతం చేయాలని TUCI జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి కోరారు. సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలారాస్తూ.. తెచ్చిన కొత్త లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.