అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం అందజేత
HNK: దామెర (M) లాదెళ్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పెసరు విజయచందర్ రెడ్డి రూ. 20,000 రూపాయల విరాళాన్ని ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పిట్టల రమేష్, అన్నబోయిన రోహిత్, జక్కుల శ్రీకాంత్, బత్తుల సుమంత్, సంఘాల సాంబరాజు, డెంగు నవీన్ ఉన్నారు.