వాలీబాల్ ప్రపంచ కప్ పోటీలకు జిల్లా వాసి

అనకాపల్లి: 2028 పారా ఒలింపిక్సే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు ఎస్.రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నం గణేశ్ తెలిపారు. అమెరికాలో వచ్చేనెల 12వ తేదీ నుంచి 18 వరకు జరిగే పారా వాలీబాల్ ప్రపంచ కప్ పోటీల్లో భారత్ తరఫున ఆడేందుకు అవకాశం లభించిందని అన్నారు. ఇందుకోసం శిక్షణకు హర్యానా రాష్ట్రంలోని హిసార్‌కు వెళ్లినట్లు తెలిపారు.