ఎస్పీ గ్రీవెన్స్‌కు 62 వినతులు
SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 62 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు.