VIDEO: రహదారిపై ప్రమాదకరంగా ధాన్యం కుప్పలు

WGL: రహదారిపై ఆరబెట్టిన ధాన్యపు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. బుధవారం పర్వతగిరి నుంచి అన్నారం వరకూ రైతులు ప్రధాన రహదారిపై ధాన్యం ఆరబెట్టుకునేందుకు వాడుకుంటున్నారు. రాత్రివేళ కూడా అక్కడే పరదాలు కప్పి ఉంచటంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రైతులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేశారు.