పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆజాద్ జయంతి
BPT: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, దేశపు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యారంగంలో ఆయన చేసిన విప్లవాత్మక సేవలను స్మరించుకుంటూ ఆయనను కొనియాడారు.