పాలమూరులో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్

పాలమూరులో విచ్చలవిడిగా వాహనాల పార్కింగ్

MBNR: జిల్లా కేంద్రం 1 టౌన్ చౌరస్తాలో ప్రయాణ ప్రాంగణానికి ద్విచక్ర వాహనదారులు అడ్డుగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగజేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌తో రోడ్డు రద్దీగా మారి ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విధుల్లో ఉన్న ఉద్యోగులు వాహనాలు పార్కింగ్ చేసి ట్రాఫిక్ పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.