డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపల్

ATP: ఉన్నత విద్యాశాఖ ఆర్టీఐ యాక్ట్ 2005 అంశంపై నిర్వహించిన పోటీలలో రాయదుర్గం మండల పరిధిలోని కేటీఎస్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కేఎన్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనంతపురంలో నిర్వహించిన వ్యాసరచన, చర్చా గోష్టి, క్విజ్ పోటీలలో ఓమేశ్వరి, వాణి, నికిత, మహమ్మద్ ఆదిల్, ప్రవీణ్ విజయం సాధించారని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు.