మిస్ ఫైర్‌లు, క్రాస్ ఫైర్‌లు ఉండవు: లోకేష్

మిస్ ఫైర్‌లు, క్రాస్ ఫైర్‌లు ఉండవు: లోకేష్

AP: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డాల్లస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విడాకులు, మిస్ ఫైర్‌లు, క్రాస్ ఫైర్‌లు ఉండవని అన్నారు. ఎన్డీయే కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. కాగా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సైతం మరో 15 ఏళ్లు కూటమి కలిసే ఉంటుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.