VIDEO: 'తమ విధులను తొలగించే కుట్ర జరుగుతుంది'
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన నిర్వహకులు ఇవాళ నిరసనకు దిగారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో తమను విధుల నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమ ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.