మత్సకారులు మహా ధర్నా
కోనసీమ: కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర లో కూనవరం స్ట్రెయిట్ కట్ తవ్వాలని కోరుతూ సోమవారం మత్స్యకారులు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. సముద్రపు నీరు పరలోకి రాకపోవడం వల్ల వేట సాగక జీవనోపాధి కోల్పోతున్నామని అన్నారు. ఈ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.