మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభం

మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభం

BDK: బూర్గంపాడు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తాతారావు మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందన్నారు.