'పాలస్తినా సంఘీభావ యాత్రను జయప్రదం చేయండి'

KMM: ఆగస్టు 7న జరిగే పాలస్తినా సంఘీభావ ప్రదర్శనలో అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని CPI ML రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సైతం ఈ దాడులను ఖండించిందని, అనేక దేశాలు ఈ దమనకాండను ఖండిస్తున్నాయని చెప్పారు.