ఈ నెల 13న జాబ్ మేళా
ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేశ్ మంగళవారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన 18-25 ఏళ్ల పురుషులు సేల్స్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.