నవోదయ అడ్మిట్ కార్డు విడుదల
కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ నెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ డి. ఎదునందన తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను cbseitms.rcil.gov.inలో చూడాలని చెప్పారు. తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరవాలన్నారు.