VIDEO: శ్రీకాకుళంలో సినీ హీరోయిన్ సందడి
SKLM: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రముఖ సినీ హీరోయిన్ రెజీనా అన్నారు. శుక్రవారం ఆమె శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి జిల్లాకు వచ్చారు. ఈ మేరకు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఈశ్వర్ రావు ఆధ్వర్యంలో "డ్రగ్స్ వద్దు బ్రో" పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.