మైనర్లు వాహనాలు నడిపితే కేసులు: డీసీపీ

మైనర్లు వాహనాలు నడిపితే కేసులు: డీసీపీ

HYD: మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అన్నారు. మైనర్ డ్రైవింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. గడిచిన 10 నెలల్లో 6 వేలకు పైగా కేసులు నమోదు చేశామని, మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు.