సైబర్ నెరగాళ్లతో రైతులు జాగ్రత్త.. : సీఐ

సైబర్ నెరగాళ్లతో రైతులు జాగ్రత్త.. : సీఐ

SRD: మీకు లోన్ గ్యారెంటీ ఇస్తామంటూ ఫోన్ చేసి నమ్మబలికే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రైతులు జాగ్రత్త పడాలని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి సోమవారం తెలిపారు. ఇటీవలే బోడుప్పల్‌లో ఓ రైతుని నేరగాళ్లు నిలువున ముంచారని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తే స్పందించరాదన్నారు. డబ్బులు అవసరం ఉన్నవారికి ఆశ చూపి మోసం చేస్తారని జాగ్రత్తగా ఉండాలన్నారు.