ఎమ్మెల్యే నాగరాజును అభినందించిన సీఎం
WGL: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజును అభినందించారు. ఇవాళ MLA సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసినందుకు సీఎం నాగరాజును ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వర్తించారని ప్రశంసించారు.