జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

సత్యసాయి: మడకశిర మండలం కంబాలపల్లికి చెందిన శివరాజు(35) ఒంటరి జీవితం గడపలేక మంగళవారం విష ద్రావకం తాగి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శివరాజ్ భార్య రత్నమ్మ 2 నెలల కింద మృతి చెందింది. తన భార్య మృతిని జీర్ణించుకోలేక జీవితంపై విరక్తితో రొళ్ల మండలం రత్నగిరిలోని తన మామ శివలింగప్ప హోటల్ ముందు విష ద్రావకం తాగాడు. ఎస్సై వీరాంజనేయులు కేసు నమోదు చేశారు.