సంజీవ్ కుమార్‌కు టీడీపీలో కీలక బాధ్యత
కర్నూలు జిల్లా మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌ను టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఇవాళ నియమించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యక్రమాల సమర్థ నిర్వహణలో భాగంగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన నియామకంపై అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు.