భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ
GNTR: మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 'మాటా-మంతి' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.