ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి స్వాధీనం

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. 24 బ్యాగుల్లో తరలిస్తున్న ఓజీ కుష్ గంజాయిని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి వచ్చినట్లు చెప్పారు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.