జమ్మిచేడు అమ్మ విశేష రూపం
GDWL: గద్వాల సమీపంలోని జమ్మిచేడులో వెలసిన జమ్ములమ్మ అమ్మవారికి మంగళవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అమ్మవారికి పుణ్య స్నానం చేయించి, ఆకుపూజ, హోమం, ప్రత్యేక హారతులను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.