ఎన్నికల నగారా.. 824 అసెంబ్లీ సీట్లకు సమరం
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 824 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. ఓటర్ల కోసం 2.19L పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సుమారు 25L మంది అధికారులు, 8.5L మంది సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యమని EC స్పష్టం చేసింది.