గ్యాస్ సరఫరా ఆలస్యంపై వినియోగదారుల ఆందోళన

గ్యాస్ సరఫరా ఆలస్యంపై వినియోగదారుల ఆందోళన

WGL: వరంగల్ హంటర్ రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. సిలిండర్ల సరఫరాలో ఆలస్యం, బుకింగ్ చేసినప్పటికీ డెలివరీ లేకపోవడం వంటి సమస్యలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తమైంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.