బొంతపల్లిలో భక్తిశ్రద్ధలతో రథోత్సవం

బొంతపల్లిలో భక్తిశ్రద్ధలతో రథోత్సవం

SRD: సంగారెడ్డి జిల్లా బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున విమాన రథోత్సవం ఘనంగా నిర్వహించారు. బాజా బజంత్రీలు, వీరభద్ర నామస్మరణల మధ్య భక్తులు రథాన్ని ఆలయం నుంచి హనుమాన్ దేవాలయం వరకు లాగి తిరిగి తీసుకొచ్చారు. మహిళల కోలాటాలు, యువకుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.