ప్రైవేట్ బస్సుల విస్తృత తనిఖీ
ELR: ఆగిరిపల్లి గ్రామంలో ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను శనివారం విస్తృతంగా తనిఖీలు చేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అన్ని విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. నియమ నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.