'జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'
VKB: జొన్న, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ధరూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆయన వినతిపత్రం అందజేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.