అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
AP: అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 21 జిల్లాల్లో వేల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఉద్యాన పంటలతో రూ.22.68 కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. మొక్కజొన్న, వరి, మినప నష్టం విలువ రూ.40 కోట్లుగా తేల్చారు. 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరప, మామిడి, బత్తాయి, నిమ్మకు నష్టం వాటిల్లిందని వివరించారు.