నియోజకవర్గం అభివృద్ధి చూడలేక మంత్రి పై అసత్య ఆరోపణలు

నియోజకవర్గం అభివృద్ధి చూడలేక మంత్రి పై అసత్య ఆరోపణలు

PPM: గతంలో ఎన్నడు జరగని విధంగా రహదారులు నిర్మాణం చేపట్టిన ఘనత మంత్రి సంధ్యారాణికే దక్కుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం పాచిపెంటలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంలో సాలూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కొంతమంది మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.