ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ గరీబ్ నగర్, ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.