బొబ్బిలి స్టేషన్‌లో పోలీసుల ఆకస్మిక దాడులు
VZM: బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో మంగళవారం భవానీపట్నం రైలులో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ ఆర్. గోవిందరావు, పట్టణ సీఐ కె. నారాయణరావు ఆధ్వర్యంలో ప్రయాణికుల బ్యాగులు, టికెట్లు పరిశీలించి అనుమానితులను విచారించారు. గంజాయి, డ్రగ్స్ మరియు అక్రమ ఆయుధాల రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.